ఈ రాశివారికి కీలక సమాచారం అందుతుంది

26 Jan, 2023 07:02 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం,, తిథి: శు.పంచమి సా.4.50 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.1.11 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.11.21 నుండి 12.54 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.22 నుండి 11.07 వరకు, తదుపరి ప.2.50 నుండి 3.33 వరకు, అమృతఘడియలు: రా.8.33 నుండి 9.32 వరకు, వసంతపంచమి, శ్రీపంచమి; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.48 

మేషం: ఆప్తులతో వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. శుభవర్తమానాలు. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక.  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది.

మిథునం: వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ధనలబ్ధి. మిత్రులతో  సఖ్యత. ఆలయ దర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విందువినోదాలు.

కర్కాటకం: పనులలో ఆటంకాలు. దూరప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధుమిత్రుల నుంచి ఒత్తిళ్లు. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. ఆలయ దర్శనాలు. అనారోగ్యం.

సింహం: రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. బంధుమిత్రులతో మాటపట్టింపులు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు.  శ్రమకు తగిన ఫలితం దక్కవచ్చు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.

తుల: నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృశ్చికం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కొత్త పనులు చేపడతారు. శుభకార్యాలకు హాజరవుతారు. మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

కుంభం: బంధువుల నుంచి ఒత్తిడులు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. పనుల్లో  ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. విద్యార్థులకు శ్రమ.

మీనం: ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఆస్తి వ్యవహారాలలో ప్రతిష్ఠంభన తొలగుతుంది. వస్తులాభాలు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా ముందుకు సాగుతాయి.


 

మరిన్ని వార్తలు