శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.పంచమి రా.7.08, వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: కృత్తిక, సా.4.33 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: సా.4.31 నుండి 5.19 వరకు, అమృతఘడియలు: ప.2.03 నుండి 3.44 వరకు, శ్రీపంచమి.
సూర్యోదయం : 6.03
సూర్యాస్తమయం : 6.07
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాల వేట. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో అకారణ వైరం. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
వృషభం: సన్నిహితుల సహాయం స్వీకరిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వస్తులాభాలు. బాకీలు వసూలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మిథునం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యయప్రయాసలు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
కర్కాటకం: సన్నిహితుల నుండి శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు అనుకున్నరీతిలో సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమాజసేవలో పాలుపంచుకుంటారు. దైవదర్శనాలు. కుటుంబంలో సౌఖ్యం. వాహనయోగం. వ్యాపార,ఉద్యోగాలు మరింత సానుకూలం.
కన్య: బంధువులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. మానసిక ఆందోళన. శ్రమ తప్పదు. పనుల్లో ప్రతిబంధకాలు. వ్యాపార, ఉద్యోగాలు మరింత నిరాశ కలిగిస్తాయి.
తుల: రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమ విఫలం. వ్యాపార, ఉద్యోగాలు అంతగా కలసిరావు.
వృశ్చికం: రుణబాధలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.
ధనుస్సు: నూతనోత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు.
మకరం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. రాబడి అంతగా కనిపించదు. ప్రయాణాలు వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో స్తబ్ధత.
మీనం: కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.