ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం, శుభవార్త వింటారు

27 Feb, 2023 07:07 IST|Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.అష్టమి తె.5.33 వరకు (తెల్లవారితే మంగళవారం), తదుపరి నవమి, నక్షత్రం: కృత్తిక ఉ.9.21 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: రా.1.54 నుండి 3.33 వరకు, దుర్ముహూర్తం: ప.12.34 నుండి 1.23 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.42 వరకు, అమృతఘడియలు: ఉ.6.34 నుండి 8.11 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 6.01. 

మేషం: కొన్ని వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు రాగలదు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబ సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కర్కాటకం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

సింహం: పరపతి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: బంధువర్గంతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. ధనవ్యయం.

తుల: బంధువులతో తగాదాలు. ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పనుల్లో జాప్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ముఖ్యమైన పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి.  ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కుంభం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. శ్రమాధిక్యం.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మీనం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూవివాదాల పరిష్కారం. శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మరిన్ని వార్తలు