దినఫలం: ఈ రాశివారికి ధనప్రాప్తి, ఆస్తులు సమకూరుతాయి! ఇంకా మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

27 Mar, 2023 06:28 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ  సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం: 6.02, సూర్యాస్తమయం: 6.07. 

తిథి: శు.షష్ఠి రా.7.37 వరకు, తదుపరి సప్తమి,
నక్షత్రం: రోహిణి సా.5.37 వరకు, తదుపరి మృగశిర,

వర్జ్యం: ఉ.9.17 నుండి 10.55 వరకు, తిరిగి రా.11.35 నుండి 1.19 వరకు,
దుర్ముహూర్తం: ప.12.27 నుండి 1.17 వరకు, తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు,
రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు,

అమృతఘడియలు: ప.2.15 నుండి 3.54 వరకు;

మేషం: పరిస్థితుల ప్రభావంతో కొన్ని పనులు వాయిదా. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఒత్తిడుల మధ్య సాగుతాయి.

వృషభం: సన్నిహితుల నుండి ధనప్రాప్తి. సమాజంలో ప్రత్యేక గౌరవం. ఆస్తులు సమకూరతాయి. పనులు చకచకా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మిథునం: మిత్రులే శత్రువుల్లా మారతారు. ఆలోచనలు నిలకడ ఉండవు. వ్యయప్రయాసలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

కర్కాటకం: వ్యవహారాలు దిగ్విజయంగా సాగుతాయి. ఆప్తుల నుండి ముఖ్య సమాచారం. విందువినోదాలు. వివాదాల పరిష్కారం. వ్యాపార, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

సింహం: చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. ఆస్తి కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ధనలాభం. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కన్య: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబంలో చికాకులు. కొన్ని అంచనాలలో పొరపాట్లు. వ్యాపార, ఉద్యోగాలు గందగోళంగా ఉంటాయి.

తుల: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఎంత శ్రమించినా ఫలితం అందులేరు. ఉద్యోగయత్నాలు విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందికర పరిస్థితి.

వృశ్చికం: అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు పాటిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.

మకరం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో కలహాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. ఆస్తుల వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

మీనం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవకు అంకితమవుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు