ఈ రాశివారు పనులలో విజయం సాధిస్తారు

28 Jan, 2023 06:42 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: శు.సప్తమి ప.2.32 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: అశ్వని రా.12.32 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.8.32 నుండి 10.08 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.37 నుండి 8.08 వరకు, అమృతఘడియలు: సా.5.12 నుండి 6.47 వరకు, రథసప్తమి; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.49 

మేషం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. వాహనయోగం. కొన్ని వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు హోదాలు.

వృషభం: అప్పులు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

మిథునం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాల్లో అనుకూలత.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వృత్తి, వ్యాపారాలు ముందడుగు వేస్తారు.

సింహం: మిత్రులు, బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తప్పవు.

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

తుల: ఉత్సాహంగా పనులు పూర్తి. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. దైవదర్శనాలు. చిరకాల మిత్రుల కలయిక. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు.

వృశ్చికం: పనులలో పురోగతి. భూవివాదాల పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: కార్యక్రమాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

మీనం: కుటుంబంలో చికాకులు. పనులు వాయిదా వేస్తారు. దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

 

మరిన్ని వార్తలు