ఈ రాశి వారికి జెట్‌ స్పీడ్‌లో పనులు పూర్తి, వస్తు లాభం

30 Mar, 2023 07:23 IST|Sakshi

శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.నవమి రా.11.54 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: పునర్వసు రా.11.32 వరకు, తదుపరి పుష్యమి, వర్జ్యం: ఉ.10.22 నుండి 12.07 వరకు, దుర్ముహూర్తం: ఉ.10.03 నుండి 10.52 వరకు తదుపరి ప.2.54 నుండి 3.43 వరకు, అమృతఘడియలు: రా.8.51 నుండి 10.38 వరకు, శ్రీరామనవమి.

సూర్యోదయం :    6.00
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం :  ఉ. 6.00 నుండి 7.30 వరకు 

మేషం: పనుల్లో ఆటంకాలు. దూరప్రయాణాలు. రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులతో వివాదాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో మార్పులు. ఆరోగ్య సమస్యలు.

వృషభం: కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. పాతమిత్రులను కలుసుకుంటారు. యుక్తితో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం కాగలవు. వస్తులాభాలు.

మిథునం: కొత్తగా రుణయత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. నిరుద్యోగుల ప్రయత్నాలు కాస్త మందగిస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు,  ఉద్యోగాలలో  ఆశించిన ప్రగతి కనిపించదు. 

కర్కాటకం: ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది.  కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. మీ అంచనాలు నిజమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతృప్తినిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

సింహం: కాంట్రాక్టర్లకు నిరాశ తప్పదు. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో విభేదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు.. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు. 

కన్య: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. వాహనయోగం. 

తుల: విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో  సమర్థత చాటుకుంటారు. దైవదర్శనాలు.

వృశ్చికం: ముఖ్యమైన పనుల్లో  అవరోధాలు. దూరప్రయాణాలు. బంధువులు, మిత్రులతో తగాదాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. కళాకారులకు నిరాశ. ధార్మిక చింతన.

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. కుటుంబ బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి..

మకరం: ప్రముఖ వ్యక్తుల నుంచి కీలక సందేశం. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులు,మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. కళాకారులకు ఊరట.

కుంభం: చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్య పనులలో  విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో సమస్యలు అధిగమిస్తారు.

మీనం: ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు. కళాకారులకు అవకాశాలు చేజారతాయి.  

మరిన్ని వార్తలు