ఈ రాశివారికి రోజంతా ఇంటాబయటా మీదే పైచేయి

1 Nov, 2022 06:35 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.అష్టమి రా.10.09 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు, తదుపరి శ్రవణం తె.5.34 వరకు (తెల్లవారితే బుధవారం), వర్జ్యం: ఉ.10.54 నుండి 12.24 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.17 నుండి 9.05 వరకు, అమృతఘడియలు: రా.7.54 నుండి 9.22 వరకు, తదుపరి రా.10.28 నుండి 11.20 వరకు; రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు; సూర్యోదయం 6.02; సూర్యాస్తమయం 5.27. 

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. 

వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. 

మిథునం: వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం

కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఉద్యోగయోగం. వ్యాపార వృద్ధి. 

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. వస్తు, వస్త్రలాభాలు. కీలక నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

కన్య: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. ఆరోగ్యభంగం. కుటుంబంలో చికాకులు. 

తుల: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యయప్రయాసలు. మిత్రులతో స్వల్ప వివాదాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరుత్సాహం. 

వృశ్చికం: నూతన ఉద్యోగప్రాప్తి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. వాహనయోగం. 

ధనుస్సు: రుణాలు చేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. .

మకరం: బంధువులతో ఆనందంగా గడుపుతారు. ఇంటాబయటా మీదే పైచేయి. సంఘంలో గౌరవం. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

కుంభం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. 

మీనం: పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విద్యార్థులకు మంచి ఫలితాలు. పనులలో విజయం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. 

మరిన్ని వార్తలు