Today's Horoscope: ఈ రాశివారికి ప్రముఖులతో  చర్చలు సఫలం.. లాభాలు దక్కే అవకాశం

2 Aug, 2022 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి శు.పంచమి రా.2.26 వరకు, తదుపరి షష్ఠి నక్షత్రం ఉత్తర ప.3.45 వరకు, తదుపరి హస్త, వర్జ్యం రా.12.16 నుండి 1.54 వరకు, దుర్ముహూర్తం ఉ.8.14 నుండి 9.05 వరకు తదుపరి రా.10.57 నుండి 11.44 వరకు అమృతఘడియలు...ఉ.8.19 నుండి 9.56 వరకు, గరుడపంచమి.

సూర్యోదయం: 5.42
సూర్యాస్తమయం: 6.30
రాహుకాలం: ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం: ఉ.9.00 నుంచి 10.30 వరకు

మేషం: ఆకస్మిక ధనలాభం. ఊహలు నిజమవుతాయి. మిత్రుల నుంచి శుభవర్తమానాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాల విస్తరణ. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృషభం: కొత్తగా రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో విభేదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో సమస్యలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు ఎదుర్కొంటారు. విద్యార్థులు మరింత శ్రమపడాలి.

మిథునం: బంధువులతో అకారణంగా వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. ముఖ్య పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. ఆలయ దర్శనాలు. ధనలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అరుదైన అవకాశాలు.

సింహం: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. ముఖ్య పనుల్లో కొంత అనుకూలం. ధనవ్యయం. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగాలలో మరింత ఒత్తిడులు. 

కన్య: శుభకార్యాలపై చర్చలు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు తీరతాయి. ఆస్తి విషయాలలో అగ్రిమెంట్లు. ఆలయాలు దర్శించుకుంటారు. వ్యాపారులకు స్వల్ప లాభాలు. ఉద్యోగుల పనిభారం కొంత తగ్గే సూచనలు.

తుల: ఆరోగ్య, కుటుంబసమస్యలు. వ్యాపారాలలో  కష్టించినా ఫలితం ఉండదు. ఉద్యోగాలలో అవిశ్రాంతంగా పనిచేయాల్సి వస్తుంది.  కొన్ని పనులు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. 

వృశ్చికం: సన్నిహితులు, మిత్రుల సాయం పొందుతారు. ఆస్తి విషయాలలో సమస్యలు తీరతాయి. ఆకస్మిక ధనలాభం. వాహన, కుటుంబసౌఖ్యం. వ్యాపారాలలో మరింత సానుకూలం. ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి.

ధనుస్సు: రెండుమూడు విధాలుగా ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన వస్తువులు కొంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

మకరం: ప్రయాణాల్లో మార్పులు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి విమర్శలు. ధనవ్యయం. వ్యాపారాలలో  స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. సోదరులు, మిత్రులతో  విభేదాలు. అనారోగ్యం. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ తప్పదు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

మీనం: సన్నిహితులతో విభేదాల పరిష్కారం.  రాబడి కొంత పెరుగుతుంది. వాహనాలు, భూములు కొంటారు. ప్రముఖులతో  చర్చలు సఫలం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు దక్కే అవకాశం. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు.

మరిన్ని వార్తలు