ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకుంటారు

3 Sep, 2022 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: శు.సప్తమి ఉ.9.52 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: అనూరాధ రా.9.23 వరకు తదుపరి జ్యేష్ఠ, వర్జ్యం: రా.2.37 నుండి 4.12 వరకు దుర్ముహూర్తం: ఉ.5.50 నుండి 7.26 వరకు అమృతఘడియలు: ఉ.11.28 నుండి 1.01 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.11
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిన్నపాటి మార్పులు.

వృషభం: పరిచయాలు విస్తృతమవుతాయి. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యల నుండి గట్టెక్కుతారు.

మిథునం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

కర్కాటకం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: సన్నిహితులు, బంధువులతో తగాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.

కన్య: ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలత.

తుల: కుటుంబంలో సమస్యలు. ఆర్థిక ఇబ్బందులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యం మందగిస్తుంది. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మకరం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి కీలక సమాచారం. చర్చలు సఫలం. పరిచయాలు పెరుగుతాయి. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అభివృద్ధి.

కుంభం: కార్యసిద్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు తొలగుతాయి.

మీనం: ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ప్రయాణాలలో ఆటంకాలు. పనులలో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.
 

మరిన్ని వార్తలు