ఈ రాశివారికి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి

3 Oct, 2022 06:46 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: శు.అష్టమి సా.4.06 వరకు, తదుపరి నవమి నక్షత్రం: పూర్వాషాఢ రా.12.50 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: ప.11.24 నుండి 12.54 వరకు, దుర్ముహూర్తం: ప.12.13 నుండి 1.02 వరకు, తదుపరి ప.2.35 నుండి 3.24 వరకు, అమృతఘడియలు: రా.8.21 నుండి 9.50 వరకు, దుర్గాష్టమి, బతుకమ్మ పండగ.

సూర్యోదయం :    5.54
సూర్యాస్తమయం    :  5.47
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: పనుల్లో ఆటంకాలు. ధనవ్యయం. ప్రయాణాలు వాయిదా పడతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరుల కలయిక. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తుల, విషయంలో కొంత నిరుత్సాహం. పనులలో తొందరపాటు. బంధువుల నుంచి ఒత్తిడులు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో సమస్యల పరిష్కారం.

కర్కాటకం: ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: బంధువిరోధాలు. పనులలో స్వల్ప ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి. 

కన్య: ప్రయాణాలు వాయిదా పడతాయి. పనుల్లో జాప్యం. బంధుమిత్రుల నుంచి ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత నిరుత్సాహం.

తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖ వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృశ్చికం: రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. ఇంటాబయటా కొన్ని సమస్యలు. బంధువులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు కొంత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

ధనుస్సు: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. బంధువుల కలయిక. భూ, వాహనయోగాలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకున్న ప్రగతి ఉంటుంది.

మకరం: మిత్రులు, బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఆలయ దర్శనాలు. పనుల్లో ఆటంకాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగాలలో శ్రమాధిక్యం. నిరుద్యోగులు మరింత కృషి చేయాలి.

కుంభం: పలుకుబడి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు.

మీనం: చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. అనుకున్న పనుల్లో విజయం. శుభవార్తలు వింటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు ఉత్సాహం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు.

మరిన్ని వార్తలు