ఈ రాశి వారికి అదనపు ఆదాయం అందుతుంది

4 Jun, 2022 06:19 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి శు.పంచమి రా.12.46 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం పుష్యమి సా.6.44 వరకు, తదుపరి ఆశ్లేష, వర్జ్యం... లేదు.  దుర్ముహూర్తం ఉ.5.29 నుండి 7.10 వరకు అమృతఘడియలు... ఉ.11.40 నుండి 1.24 వరకు. 

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు 

మేషం: కార్యక్రమాలు ముందుకు సాగవు.  ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధుగణంతో విరోధాలు నెలకొంటాయి. కుటుంబ సమస్యలు నెలకొంటాయి. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. 

వృషభం: పరిచయాలు పెరుగుతాయి. ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు అధిక లాభాలు అందుకుంటారు.  ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. 

మిథునం: ఆదాయాన్ని మించిన ఖర్చులు. బంధువర్గంతో విభేదాలు ఏర్పడవచ్చు.  దూరప్రయాణాలు ఉంటాయి. వ్యాపారులకు సామాన్యంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. 

కర్కాటకం: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు మెరుగ్గా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. రాబడి పెరిగి అవసరాలు తీరతాయి. వ్యాపారులకు లాభాలు అందుతాయి.  ఉద్యోగులకు ఊహించని ఇంక్రిమెంట్లు. 

సింహం: కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి . ఆరోగ్య సమస్యలు. కార్యక్రమాలలో ఆటంకాలు. అనుకున్న రాబడి అందక ఇబ్బంది. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. వ్యాపారాలు నిదానంగా సాగుతాయి.  

కన్య: బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్నేహితుల నుంచి శుభవార్తలు వింటారు. నిరుద్యోలకు ఉద్యోగయత్నాలలో విజయం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది వ్యాపారులు  లాభాలతో ఉత్సాహంగా అడుగువేస్తారు. ఉద్యోగులకు ప్రోత్సాహం. 

తుల: పలుకుబడి పెంచుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. సన్నిహితుల నుంచి కీలక సమాచారం. అదనపు ఆదాయం సమకూరుతుంది. వ్యాపారులకు లాభాలు రావచ్చు. ఉద్యోగులకు ప్రశంసలు. 

వృశ్చికం: అప్పులు చేస్తారు. స్నేహితులతో విభేదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కార్యక్రమాలలో అవాంతరాలు.  వాహనాల విషయంలో మెలకువ పాటించాలి. భూవివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారులకు ఆటుపోట్లు. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి. 

ధనుస్సు: కుటుంబంలో చికాకులు. అనుకున్న ఆదాయం లేక ఇబ్బందులు. శారీరక  రుగ్మతలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగవర్గాలకు  బాధ్యతలు మీదపడతాయి. 

మకరం: బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. కార్యక్రమాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయులతో చర్చలు జరుపుతారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులు లాభాల బాటలో పయనిస్తారు. ఉద్యోగవర్గాలకు పదోన్నతి సూచనలు.

కుంభం: శుభవార్తలు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయాలు దర్శనాలు.  వ్యాపారులు అనుకున్నది సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు తథ్యం. 

మీనం: రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. బంధుమిత్రుల నుంచి అపవాదులు. భూవివాదాలు నెలకొంటాయి. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు. 

మరిన్ని వార్తలు