Today Horoscope: ఈ రాశివారికి ఆప్తుల నుంచి శుభవర్తమానాలు.. అదనపు ఆదాయం

4 Dec, 2022 06:49 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.ఏకాదశి ఉ.7.22 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: రేవతి ఉ.8.34 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం: తె.4.37 నుండి 6.13 వరకు (తెల్లవారితే సోమవారం), దుర్ముహూర్తం: సా.3.50 నుండి 4.34 వరకు, అమృతఘడియలు: రా.1.50 నుండి 2.44 వరకు, గీతాజయంతి.

సూర్యోదయం        :  6.19
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పరిచయాలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తినిస్తుంది. కార్యజయం. శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి. కీలక నిర్ణయాలు.

వృషభం: కుటుంబంలో చికాకులు. మనశ్శాంతి లోపిస్తుంది. అంచనాలు తప్పుతాయి. బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మిథునం: కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గౌరవం. భూవివాదాలు తీరతాయి. గృహ, వాహనయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందుకు సాగుతారు.

కర్కాటకం: ఆప్తుల నుంచి శుభవర్తమానాలు. అదనపు ఆదాయం సమకూరుతుంది. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: పనులు నత్తనడకన సాగుతాయి. దూరప్రయాణాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

కన్య: ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనులు మందగిస్తాయి. విద్యార్థులకు అంతగా అనుకూలించదు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు చోటుచేసుకుంటాయి.

తుల: ఇంటిలో శుభకార్యాలు. ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: ఇంటర్వ్యూలలో విజయం. ఆప్తులు అన్నింటా సహకరిస్తారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

ధనుస్సు: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ప్రయాణాలలో మార్పులు. స్నేహితులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మకరం: ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు. బంధువులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. పనులలో ఆటంకాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: ఉద్యోగ ప్రయత్నాలలో విజయం. విందువినోదాలు. సోదరుల నుంచి భూ, ధనలాభాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మరిన్ని వార్తలు