ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తులాభాలు

4 May, 2022 06:55 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి శు.చవితి పూర్తి (24గంటలు), నక్షత్రం మృగశిర రా.3.54 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం ఉ.7.34 నుండి 9.20 వరకు దుర్ముహూర్తం ప.11.32 నుండి 12.20 వరకు అమృతఘడియలు... సా.6.11 నుండి 7.57 వరకు. 

సూర్యోదయం :    5.37
సూర్యాస్తమయం    :  6.16
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

రాశి ఫలాలు..

మేషం: ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలకు తగినట్లుగా ఉంటుంది.

వృషభం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. కొత్త రుణాలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా కొనసాగుతాయి.

మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వస్తులాభాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

కర్కాటకం: సన్నిహితుల నుంచి సమస్యలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బంది కలిగిస్తాయి.

సింహం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. నూతన వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు.

కన్య: ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులతో సత్సంబంధాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

తుల: దూరప్రయాణాలు. పనుల్లో ప్రతిబంధకాలు. రుణబాధలు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వాహన విషయంలో జాగ్రత్తలు అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉండవచ్చు.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. ప్రయాణాలు రద్దు చేసుకుంటారు. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: ఇంటాబయటా ప్రోత్సాహం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు.

కుంభం: వ్యవహారాలలో ఆటంకాలు. బా«ధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో మాటపట్టింపులు. రుణయత్నాలు సాగిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: కొన్ని పనులు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

మరిన్ని వార్తలు