ఈ రాశి వారు అనుకున్న లాభాలు అందుకుంటారు

5 Jun, 2022 06:42 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.షష్ఠి రా.2.04 వరకు తదుపరి సప్తమి, నక్షత్రం ఆశ్లేష రా.8.44 వరకు తదుపరి మఖ, వర్జ్యం ఉ.8.36 నుండి 10.20 వరకు, దుర్ముహూర్తం సా.4.44 నుండి 5.34 వరకు, అమృతఘడియలు... రా.7.02 నుండి 9.05 వరకు. 

సూర్యోదయం        :  5.28
సూర్యాస్తమయం    :  6.27
రాహుకాలం :  సా.4.30 – 6.00 
యమగండం :  ప.12.00 – 1.30 

రాశి ఫలాలు..

మేషం: ఆదాయం అంతగా ఉండదు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పరపతి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. కళాకారులకు కొత్త అవకాశాలు.

మిథునం: మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అగ్రిమెంట్లు వాయిదా. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిభారం. 

కర్కాటకం: కార్యజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు.. వాహనసౌఖ్యం. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో  అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. 

సింహం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగాలలో సమస్యలు. 

కన్య: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాటì మిత్రుల  నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

వృశ్చికం: కుటుంబసమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: మిత్రుల నుండి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. అనుకోని ఖర్చులు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

మకరం: కీలక నిర్ణయాలు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. కొత్త పరిచయాలు. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం: అప్పులు తీరుస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: రాబడికి మించి ఖర్చులు. కుటుంబబాధ్యతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మరింత శ్రమపడాలి. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు.

మరిన్ని వార్తలు