ఈ రాశివారికి ఆస్తిలాభం.. వాహనయోగం

5 Nov, 2022 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి:  శు.ద్వాదశి సా.5.30 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.1.07 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ఉ.11.06 నుండి 12.41 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.05 నుండి 7.33 వరకు, అమృతఘడియలు: ఆ.9.50 నుండి 11.34 వరకు, క్షీరాబ్ది ద్వాదశి; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం 6.04; సూర్యాస్తమయం 5.25. 

మేషం: ముఖ్యమైన వ్యవహారాలు కొన్ని వాయిదా వేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా గందరగోళ పరిస్థితి. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

వృషభం: కొత్త విషయాలు గ్రహిస్తారు. చర్చల్లో కొంత పురోగతి. మిత్రుల నుంచి ముఖ్య సమాచారం. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలలో మీ కృషి ఫలిస్తుంది. దైవచింతన.

మిథునం: ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. అదనపు ఆదాయం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: చేపట్టిన పనులు కొంత నిదానిస్తాయి. ఆలోచనలు కలసిరావు. కుటుంబసమస్యలు ఎదురవుతాయి.  దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని అడ్డంకులు.

సింహం: పనులలో అడ్డంకులు. ఆస్తి వివాదాలు.  శ్రమాధిక్యం. మిత్రుల నుంచి విమర్శలు. దైవచింతన. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు పెరుగుతాయి.

కన్య: బాకీలు వసూలవుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఆస్తిలాభం. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

తుల: పనులు సకాలంలో పూర్తి. దైవదర్శనాలు. నూతన ఉద్యోగప్రాప్తి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. వాహనయోగం. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో కొత్త చిక్కులు.

ధనుస్సు: శ్రమ తప్పదు. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. భూ వివాదాలు. దైవదర్శనాలు. ఇంటర్వ్యూలు నిరాశ పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు.

మకరం: ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్య సమస్యలు. బంధువులతో స్వల్ప విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు ఇబ్బందిగా మారవచ్చు.

మీనం: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి

మరిన్ని వార్తలు