Today Horoscope: ఈ రాశి వారికి చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు

6 Jun, 2022 06:06 IST|Sakshi

మేషం...ఆదాయం అంతగా ఉండదు. ఆలోచనలు కార్యరూపం దాల్చవు. ఆరోగ్యంపై  శ్రద్ధ వహించాలి. కార్యక్రమాలు ముందుకు సాగవు.  వ్యాపారాలలో చికాకులు పెరుగుతాయి. ఉద్యోగాలలో విధుల్లో ఒత్తిడులు. 

వృషభం....ఆదాయం కంటే ఖర్చులు అధికంగా ఉంటాయి. ముఖ్య కార్యక్రమాలలో ఆటంకాలు. భూవివాదాలు నెలకొంటాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు ఎదురుకావచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు.

మిథునం.....దూరపు బంధువుల నుంచి శుభవార్తలు. కుటుంబంలో ప్రోత్సాహం. అదనపు రాబడి ఉంటుంది. కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు. 

కర్కాటకం....ఆదాయం తగ్గి రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో వైరం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. కాంట్రాక్టులు చేజారతాయి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

సింహం..చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు అమలు చేస్తారు. అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో విజయం. ఉద్యోగ విధుల్లో ప్రశంసలు. వ్యాపారాలలో నూతనోత్సాహం. 

కన్య.....కుటుంబసమస్యలు ఎదురవుతాయి. కార్యక్రమాలలో ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలలో  చికాకులు. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

తుల..ఉద్యోగప్రయత్నాలు అనుకూలిస్తాయి. కార్యజయం. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆలయాలు దర్శిస్తారు.  పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఉన్నత హోదాలు. 

వృశ్చికం....ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటాబయటా ఎదురుండదు. పరపతి పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. రాబడి ఆశాజనకం. వ్యాపారాలలో అనుకూలత. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

ధనుస్సు.....కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయం తగ్గుతుంది.  ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. బంధువులతో విభేదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు

మకరం.....ప్రయాణాలలో అవరోధాలు. కొన్ని కార్యక్రమాలలో అవాంతరాలు. కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశాజనకమే.

కుంభం...యత్నకార్యసిద్ధి. అందర్నీ మాటలతో ఆకట్టుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యాలు. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మీనం....ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో శ్రమాధిక్యం. 

మరిన్ని వార్తలు