Today's Horoscope: ఈ రాశివారు శుభవార్తలు వింటారు.. ఆస్తులు కొనుగోలు చేస్తారు

6 Jul, 2022 06:42 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి శు.సప్తమి ప.2.50 వరకు తదుపరి అష్టమి, నక్షత్రం ఉత్తర ఉ.8.04 వరకు, తదుపరి హస్త వర్జ్యం సా.4.32 నుండి 6.10 వరకు దుర్ముహూర్తం ప.11.38 నుండి 12.29 వరకు అమృతఘడియలు... రా.2.14 నుండి 3.51 వరకు.

సూర్యోదయం :    5.33
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృషభం: వ్యవహారాలలో జాప్యం. ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. బంధువులు, మిత్రులతో కలహాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. కుటుంబంలో కొత్త సమస్యలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

కర్కాటకం: శుభకార్యాల ప్రస్తావన. కుటుంబంలో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఆశాజనకంగా ఉంటుంది.

సింహం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ కృషి ఫలిస్తుంది.

తుల: వ్యవహారాలు నిదానిస్తాయి. నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

ధనుస్సు: కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అడుగు ముందుకు  వేస్తారు.

మకరం: కుటుంబంలో కొత్త సమస్యలు బంధువుల తాకిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

మీనం: యుక్తితో సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనయోగం. విద్యావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు