ఈ రోజు రాశి ఫలాలు 06-09-2022

6 Sep, 2022 06:36 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.ఏకాదశి  రా.12.38 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం: పూర్వాషాఢ సా.4.46 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: రా.12.11 నుండి 1.39 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.07 వరకు, తదుపరి రా.10.47 నుండి 11.34 వరకు అమృతఘడియలు: ప.12.17 నుండి 1.46 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.08
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం: పనులు మధ్యలో వాయిదా. ఆలయాలు సందర్శిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. సోదరులతో కలహాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో పనిభారం.

వృషభం: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆలయాల సందర్శనం. ఇంటాబయటా ఒత్తిడులు. పనులు వాయిదా వేస్తారు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మిథునం: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కర్కాటకం: మిత్రులు, బంధువులతో సఖ్యత. విందువినోదాలు.పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనాలు. వాహనయోగం. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలస్థితి.

సింహం: పనులలో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం.

కన్య: సన్నిహితుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: వ్యవహారాలలో అవాంతరాలు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

ధనుస్సు: విచిత్ర సంఘటనలు. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులలో పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి కొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తిలాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మీనం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వస్తులాభాలు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మరిన్ని వార్తలు