Today Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే, ఆకస్మిక ధనలాభం

6 Dec, 2022 06:58 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, తిథి: శు.త్రయోదశి ఉ.6.42 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: భరణి ఉ.9.14 వరకు, తదుపరి కృత్తిక, వర్జ్యం: రా.9.44 నుండి 11.25 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.31 నుండి 9.15 వరకు, తదుపరి రా.10.31 నుండి 11.23 వరకు, అమృతఘడియలు: లేవు; రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు; యమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు; సూర్యోదయం 6.20; సూర్యాస్తమయం 5.21. 

మేషం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధుమిత్రుల నుండి కొన్ని ఇబ్బందులు. అనారోగ్యం. పనులు మధ్యలో వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దైవదర్శనాలు. ఒత్తిడుల నుండి బయటపడతారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కర్కాటకం: నూతనోత్సాహం. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. స్థిరాస్తివృద్ధి. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

సింహం: ఆరోగ్యసమస్యలు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కన్య: పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త చిక్కులు.

తుల: ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. ధన, వస్తులాభాలు. కొత్త పరిచయాలు. నిర్ణయాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికం: సోదరుల నుండి శుభవార్తలు. వాహనాలు కొంటారు. ఆస్తులు సమకూరతాయి. కొన్ని వివాదాల నుండి గట్టెక్కుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. వ్యవహారాలు మందగిస్తాయి. శ్రమ తప్పదు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థాయిలో ఉంటాయి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

కుంభం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తులు కొంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు,ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో తగాదాలు. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

మరిన్ని వార్తలు