ఈ రోజు రాశి ఫలాలు 07-09-2022

7 Sep, 2022 06:41 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.ద్వాదశి రా.10.15 వరకు తదుపరి త్రయోదశి, నక్షత్రం: ఉత్తరాషాఢ ప.3.05 వరకు తదుపరి శ్రవణం, వర్జ్యం: సా.6.47 నుండి 8.16 వరకు దుర్ముహూర్తం: ప.11.32 నుండి 12.21 వరకు అమృతఘడియలు: ఉ.9.05 నుండి 10.32 వరకు.

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. విద్యార్థులకు నూతన అవకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

వృషభం: సన్నిహితుల నుండి సాయం అందుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. కొన్నివ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ అంచనాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మిథునం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: సన్నిహితులతో మాటపట్టింపులు. శ్రమకు ఫలితం ఉండదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: మిత్రుల నుండి కీలక సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొంత పురోగతి.

కన్య: రుణయత్నాలు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

వృశ్చికం: మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకం.

మకరం: ఆస్తులు కొనుగోలు చేస్తారు. యుక్తితో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

కుంభం: బంధువులతో విరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆస్తి వివాదాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

మీనం: సోదరుల నుండి ఒత్తిడులు. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మరిన్ని వార్తలు