ఈ రాశి వారికి ఊహించని విధంగా ధనలాభం

7 Nov, 2022 07:23 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: శు.చతుర్దశి ప.3.48 వరకు, తదుపరి పౌర్ణమి, నక్షత్రం: అశ్వని రా.1.02 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: రా.8.56 నుండి 10.34 వరకు..

దుర్ముహూర్తం: ప.12.06 నుండి 12.52 వరకు, తదుపరి ప.2.23 నుండి 3.08 వరకు,
అమృతఘడియలు: సా.5.43 నుండి 7.21 వరకు, కార్తీక పౌర్ణమి;
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు,
యమగండం : ఉ.10.30 నుండి 12.00 వరకు;
సూర్యోదయం 6.04;
సూర్యాస్తమయం 5.24.
 

మేషం: ఊహించని రీతిలో ధనలాభం. పరిస్థితులు అనుకూలిస్తాయి. శ్రమ ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

వృషభం: పనులలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు.

మిథునం: వ్యవహారాలలో విజయం. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి పిలుపు రావచ్చు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తొలగుతుంది.

కర్కాటకం: ఉద్యోగాలు దక్కించుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పనుల్లో అవాంతరాలు తొలగుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం కాగలవు.

సింహం: వ్యవహారాలు మందగిస్తుంది. బంధువులతో తగాదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: మిత్రుల నుండి విమర్శలు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

తుల: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలయ దర్శనాలు. మిత్రుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన విధంగా కొనసాగుతాయి.

వృశ్చికం: పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో పనులు పూర్తి. సంఘంలో విశేష గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: బంధువర్గంతో కలహాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

మకరం: సన్నిహితులతో మాటపట్టింపులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో శ్రమాధిక్యం.

కుంభం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. వస్తు, వస్త్రలాభాలు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు రాగలవు. విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

మీనం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. బంధువులతో విరోధాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మరిన్ని వార్తలు