ఇవాళ్టి దినఫలం: ఈ రాశివారికి బాకీలు వసూలవుతాయి.. ఇంకా ఏ రాశివారికి ఎలాగుందంటే..

7 Dec, 2022 06:35 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం,
సూర్యోదయం 6.21; సూర్యాస్తమయం 5.21, బుధవారం 

తిథి: శు.చతుర్దశి ఉ.7.10 వరకు, తదుపరి పౌర్ణమి,
నక్షత్రం: కృత్తిక ఉ.10.20 వరకు, తదుపరి రోహిణి,

వర్జ్యం: రా.3.20 నుండి 5.04 వరకు,
దుర్ముహూర్తం: ప.11.28 నుండి 12.14 వరకు,

అమృత ఘడియలు: ఉ.7.46 నుండి 9.29 వరకు;

రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు;
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు;

మేషం: అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. బాధ్యతలు అధికమవుతాయి. దూరప్రయాణాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

వృషభం: వ్యవహారాలలో ముందడుగు వేస్తారు. భూములు, ఆభరణాలు కొంటారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

మిథునం: ప్రయాణాలలో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. శ్రమాధిక్యం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. విందువినోదాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత కలసివస్తాయి.

సింహం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. పరిచయాలు విస్తృతమవుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు వృద్ధి చెందుతాయి.

కన్య: శ్రమతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులలో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: సన్నిహితులతో వివాదాలు. నిర్ణయాలలో పొరపాట్లు. పనులు మధ్యలో విరమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ధనలాభం. భూయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి. ఆలయ దర్శనాలు.

ధనుస్సు: రుణ విముక్తులవుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్య సూచనలు. కుటుంబంలో సమస్యలు ఎదురుకావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

కుంభం: రాబడికి మించిన ఖర్చులు. సమస్యలతో కుస్తీపడతారు. ఆరోగ్య విషయంలో చికాకులు. సోదరులతో కలహాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం: కుటుంబంలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మరిన్ని వార్తలు