ఈ రోజు రాశి ఫలాలు 08-09-2022

8 Sep, 2022 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.త్రయోదశి రా.7.58 వరకు, తదుపరి చతుర్దశి, నక్షత్రం: శ్రవణం ప.1.32 వరకు, తదుపరి ధనిష్ఠ వర్జ్యం: సా. 5.18 నుండి 6.46 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.54 నుండి 10.43 వరకు, తదుపరి ప.2.51 నుండి 3.40 వరకు అమృతఘడియలు: రా.2.21 నుండి 3.51 వరకు

సూర్యోదయం :    5.49
సూర్యాస్తమయం    :  6.07
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు
 

మేషం: శుభవార్తా శ్రవణం. ఇంటాబయటా అనుకూలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. బంధువుల కలయిక. ఆస్తి వివాదాలు పరిష్కారం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి.

వృషభం: కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: ఆరోగ్యసమస్యలు. పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువర్గంతో విభేదాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళాకారులకు సామాన్యస్థితి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో వివాదాల పరిష్కారం. ఇంట్లో శుభకార్యాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవేత్తల యత్నాలు సఫలం.

సింహం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కళాకారులకు కార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

కన్య: చేపట్టిన పనులు నిరాశ పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. సన్నిహితులతో విభేదాలు. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. స్వల్ప అనారోగ్యం.

తుల: వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగాలలో చికాకులు. 

వృశ్చికం: శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో మరింత పురోగతి సాధిస్తారు. బంధువుల కలయిక. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి.

ధనుస్సు: కొన్ని పనులలో అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. ధనవ్యయం. వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. నూతన ఉద్యోగయోగం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కుంభం: పనుల్లో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ. 

మీనం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. ఉద్యోగయత్నాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మరిన్ని వార్తలు