May 9th Horoscope: ఈ రాశివారికి ఒక సమాచారం ఊరటనిస్తుంది..

9 May, 2022 06:18 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి శు.అష్టమి ప.2.06 వరకు, తదుపరి నవమి నక్షత్రం ఆశ్లేష ప.1.20 వరకు, తదుపరి మఖ, వర్జ్యం రా.2.03 నుండి 3.45 వరకు, దుర్ముహూర్తం ప.12.21 నుండి 1.10 వరకు తదుపరి ప.2.54 నుండి 3.45 వరకు అమృతఘడియలు... ఉ.11.33 నుండి 12.46 వరకు.

సూర్యోదయం :    5.34
సూర్యాస్తమయం    :  6.17
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. శ్రమ మరింత పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పరిస్థితులు అనుకూలిస్తాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  నిరాశ తొలగుతుంది.

మిథునం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. నిర్ణయాలు మార్చుకుంటారు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కర్కాటకం: సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

సింహం: వ్యవహారాలు మందగిస్తాయి. సోదరులతో కలహాలు. నిర్ణయాలు మార్చుకుంటారు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కన్య: ఇంటర్వ్యూలు రాగలవు. ఆస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. ధన, వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి.. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

తుల: చిన్ననాటి మిత్రుల కలయిక. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలస్థితి.

వృశ్చికం: రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా. చర్చలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు అనివార్యం.

ధనుస్సు: బాధ్యతలు పెరుగుతాయి. సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మకరం: పనులు సాఫీగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సజావుగా సాగుతాయి.

కుంభం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. సేవాభావం పెరుగుతుంది. పరిస్థితులు  అనుకూలిస్తాయి. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ఆకస్మిక ప్రయాణాలు. సన్నిహితులతో విభేదాలు. అనారోగ్య సూచనలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు.

మరిన్ని వార్తలు