Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు

9 Jul, 2022 06:43 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి శు.దశమి ఉ.11.44 వరకు తదుపరి ఏకాదశి, నక్షత్రం స్వాతి ఉ.7.31 వరకు తదుపరి విశాఖ, వర్జ్యం ప.12.50 నుండి 2.23 వరకు దుర్ముహూర్తం ఉ.5.34 నుండి 7.17 వరకు అమృతఘడియలు... రా.10.03 నుండి 11.35 వరకు.

సూర్యోదయం :    5.35
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు
 

మేషం: ఆర్థికంగా బలం చేకూరుతుంది. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి.

వృషభం: రుణభారం తొలగుతుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

కర్కాటకం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

సింహం: ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధనలబ్ధి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా సాగుతాయి.

కన్య: కొన్ని సమస్యలతో కుస్తీ పడతారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యగాలు చికాకు పరుస్తాయి.

తుల: ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. చిత్రమైన సంఘటనలు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

వృశ్చికం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. ఉద్యోగయత్నాలు ఫలించవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు మీకు చేదోడుగా నిలుస్తారు. మీ సత్తా చాటుకునే రోజు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.

మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రుల నుండి శుభవార్తలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కుంభం: సన్నిహితులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని సమస్యలతో సతమతమవుతారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మీనం: మీ అంచనాలు ఫలించవు. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు. 

మరిన్ని వార్తలు