ఈ రోజు రాశి ఫలాలు 09-09-2022

9 Sep, 2022 06:46 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: శు.చతుర్దశి సా.5.52 వరకు, తదుపరి పౌర్ణమి నక్షత్రం: ధనిష్ఠ ప.12.08 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: సా.6.56 నుండి 8.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.16 నుండి 9.06 వరకు తదుపరి ప.12.22 నుండి 1.12 వరకు, అమృతఘడియలు: తె.4.04 నుండి 5.32 వరకు (తెల్లవారితే శనివారం).

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.06
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ అంచనాలు నిజమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. నిరుద్యోగుల యత్నాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: పనుల్లో కొద్దిపాటి ఆటంకాలు. కొత్త బాధ్యతలు తప్పవు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు అనుకోని మార్పులు.

కర్కాటకం: దూరపు బంధువుల కలయిక. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. విందువినోదాలు.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. దైవచింతన.

కన్య: వ్యవహారాలు కొంత మందగిస్తాయి. శ్రమ తప్పదు. నిర్ణయాలలో మార్పులు. దైవదర్శనాలు. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

తుల: ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన పనుల్లో  అవాంతరాలు. వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు కొంతగా లాభిస్తాయి. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

వృశ్చికం: మిత్రులతో వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తిలాభం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. ఆధ్యాత్మిక చింతన.

ధనుస్సు: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు. కళాకారులకు ఒత్తిడులు.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. కార్యజయం. ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు. కళాకారులకు సన్మానాలు.

కుంభం: ముఖ్యమైన పనులు మందగిస్తాయి. ఆరోగ్యసమస్యలు. మిత్రులతో అకారణంగా తగాదాలు.  ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు.

మీనం: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం. శుభవార్తలు వింటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మరిన్ని వార్తలు