Today Horoscope: ఈ రాశివారికి దూరప్రాంతాల నుండి శుభవార్తలు.. వాహనయోగం

10 Jun, 2022 06:13 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.ఏకాదశి రా.1.24 వరకు, తదుపరి ద్వాదశి నక్షత్రం చిత్త రా.11.57 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం ఉ.8.11 నుండి 9.46 వరకు, దుర్ముహూర్తం ఉ.8.04 నుండి 8.55 వరకు, తదుపరి ప.12.23 నుండి 1.15 వరకు అమృతఘడియలు... సా.5.38 నుండి 7.11 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం     :  6.29
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

వృషభం: కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చిక్కులు.

మిథునం: ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ప్రయాణాలలో మార్పులు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: దూరప్రాంతాల నుండి శుభవార్తలు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

సింహం: సన్నిహితులతో మాటపట్టింపులు. అనారోగ్యం. అనుకున్న పనుల్లో అవాంతరాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

కన్య: బంధువులతో సత్సంబంధాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. మీ ఊహలు నిజం కాగలవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. బంధువుల నుండి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

ధనుస్సు: రుణ విముక్తి లభిస్తుంది. ఆస్తులు సమకూరతాయి. ఆహ్వానాలు అందుతాయి. దైవచింతన. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మకరం: పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

కుంభం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

మీనం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మరిన్ని వార్తలు