Today's Horoscope: ఈ రాశివారికి శుభవార్తా శ్రవణం.. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది

10 Jul, 2022 07:02 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం, తిథి శు.ఏకాదశి ఉ.9.55 వరకు, తదుపరి ద్వాదశి, నక్షత్రం విశాఖ ఉ.6.32  వరకు, తదుపరి అనూరాధ వర్జ్యం ఉ.10.16 నుండి 11.51 వరకు దుర్ముహూర్తం సా.4.52 నుండి 5.43 వరకు అమృతఘడియలు... లేవు, తొలి ఏకాదశి. 

సూర్యోదయం        :  5.35
సూర్యాస్తమయం    :  6.35
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు

మేషం: పనులు కొంత మందగిస్తాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కీలక నిర్ణయాలలో మార్పులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

మిథునం: పనులు అనుకున్నరీతిలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. సన్నిహితులతో సఖ్యత. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుమణుగుతాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా సాగవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

కన్య: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుండి పిలుపు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

తుల: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆస్తి వివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో మార్పులు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృశ్చికం: శుభవర్తమానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో వివాదాలు తీరతాయి.

ధనుస్సు: కొన్ని పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు అధికం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

మకరం: సన్నిహితుల సహాయంతో పనులు పూర్తి. సంఘంలో విశేష ఆదరణ. ప్రముఖులతో పరిచయాలు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కుంభం: చిత్రమైన సంఘటనలు. కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా కొనసాగుతాయి.

మీనం: వ్యవహారాలు  నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. దైవచింతన. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

మరిన్ని వార్తలు