Today Horoscope: ఈ రాశి వారికి నూతన ఉద్యోగాలు దక్కుతాయి

11 Jun, 2022 06:00 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.ద్వాదశి రా.11.55 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం స్వాతి రా.11.14 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం ఉ.5.23 నుండి 6.57 వరకు, తిరిగి తె.4.37 నుండి 6.09 వరకు (తెల్లవారితే ఆదివారం), దుర్ముహూర్తం ఉ.5.29 నుండి 7.11 వరకు అమృతఘడియలు... ప.2.43 నుండి 4.18 వరకు.

సూర్యోదయం :    5.28
సూర్యాస్తమయం    :  6.29
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

మేషం....పనులు అనుకున్నంత వేగంగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

వృషభం....రాబడి ఆశించినంతగా పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలు నిర్వహిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మిథునం...వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

కర్కాటకం... చేపట్టిన వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. దైవదర్శనాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

సింహం....మిత్రుల సలహాలు స్వీకరిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరతాయి. సన్నిహితులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

కన్య...రుణాలు చేయాల్సిన పరిస్థితి. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు తీరతాయి. పనులు మందగిస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల....కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొన్ని సమస్యలు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

వృశ్చికం....కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆస్తి ఒప్పందాలలో మార్పులు. అనారోగ్యం. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు....పనులు చకచకా సాగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. సన్నిహితుల నుంచి మాటసాయం. కాంట్రాక్టులు లభిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురుండదు.

మకరం...నూతన ఉద్యోగాలు దక్కుతాయి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. చర్చలు సఫలం. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వ్యూహాలు ఫలిస్తాయి.

కుంభం...ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం...బంధువులు ఒత్తిడులు పెంచుతారు. ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మరిన్ని వార్తలు