రాశి ఫలం: ఈ రాశివారికి ప్రయాణాలు వాయిదా!.. మిగతా రాశులవారికి ఎలాగ ఉందంటే..

13 Jan, 2023 06:35 IST|Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, పుష్యమాసం,
సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.39 

తిథి: బ.షష్ఠి ప.1.58 వరకు, తదుపరి సప్తమి,
నక్షత్రం: ఉత్తర ప.1.07వరకు, తదుపరి హస్త,

వర్జ్యం: రా.9.51 నుండి 11.31 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.33 వరకు, తదుపరి ప.12.31 నుండి 1.15 వరకు,

అమృతఘడియలు: లేవు
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,

మేషం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

వృషభం: ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మిథునం: ముఖ్య వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. స్నేహితుల నుండి ఒత్తిడులు. దూరప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనసౌఖ్యం. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అంతగా కలసిరావు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ప్రయాణాలు కుదించుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

కన్య: రుణవిముక్తులవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. సమాజసేవలో భాగస్వాములవుతారు. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింతగా కలసివస్తాయి.

తుల: కొన్ని వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బంది కలిగిస్తుంది. దూరప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

వృశ్చికం: నూతన పరిచయాలు. ఆకస్మిక ధన,వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు: ఉద్యోగలాభం. ఆస్తుల క్రయవిక్రయాలలో పురోగతి. పెద్దల సలహాలు పాటిస్తారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మకరం: రుణభారాలు. వ్యవహారాలు ముందుకు సాగవు. మీ ఆలోచనలు స్థిరంగా సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. 

కుంభం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తి తగాదాలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సమస్యలతో నడుస్తాయి.

మీనం: శుభవార్తలు అందుతాయి. ముఖ్య కార్యక్రమాలలో విజయం. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సంతోషం కలిగిస్తాయి.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు