Today Horoscope: ఈ రాశివారికి వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి

13 Aug, 2022 06:43 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం,తిథి బ.విదియ రా.3.31 వరకు,తదుపరి తదియ నక్షత్రం శతభిషం రా.3.01 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం ఉ.10.58 నుండి 12.32 వరకు, దుర్ముహూర్తం ఉ.5.44 నుండి 7.24 వరకు, అమృతఘడియలు...రా.8.09 నుండి 9.41 వరకు.

సూర్యోదయం :    5.45
సూర్యాస్తమయం    :  6.25
రాహుకాలం :  ఉ.9.00 నుండి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుండి 3.00 వరకు 

మేషం: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

వృషభం: నిరుద్యోగుల కృషి సఫలం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుతకు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు పుంజుకుంటాయి.

మిథునం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి అంతగా కలసిరాదు. ఆస్తి వివాదాలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కర్కాటకం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. నిర్ణయాలలో పొరపాట్లు. వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. చర్చలు సఫలం. కీలక నిర్ణయాలు. వ్యవపారాలు సాఫీగా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య: రుణబాధలు తొలగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. దైవదర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

తుల: బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం: రాబడికి మించి ఖర్చులు. కుటుంబంలో ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. కష్టానికి ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: శుభకార్యాలకు హాజరవుతారు. స్వల్ప ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. దైవదర్శనాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి.

మకరం: కుటుంబంసభ్యులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. రుణబాధలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: శుభవార్తలు వింటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సానుకూలత.

మీనం: రుణాలు చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబసభ్యుల నుండి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మరిన్ని వార్తలు