ఈ రాశి వారు శుభవార్తలు వింటారు, వస్తులాభం

13 Nov, 2022 06:49 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం తిథి: బ.పంచమి రా.10.04 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం:  ఆరుద్ర ఉ.8.54 వరకు, తదుపరి పునర్వసు, వర్జ్యం: రా.10.09 నుండి 11.56 వరకు, దుర్ముహూర్తం: సా.3.50 నుండి 4.36 వరకు, అమృతఘడియలు: లేవు

సూర్యోదయం        :  6.07
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. ఆప్తులు సలహాలు పాటిస్తారు. వస్తులాభాలు.  ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

వృషభం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. సోదరులతో కలహాలు. దైవచింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. 

మిథునం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. కీలక నిర్ణయాలు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

కర్కాటకం: దూరప్రయాణాలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో  చికాకులు. ఇంటాబయటా ఒత్తిడులు.

సింహం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసత్తా నిరూపించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. విందువినోదాలు. కార్యజయం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కన్య: వివాదాలు పరిష్కారం. శుభవార్తలు వింటారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

తుల: పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలోచనలు కలసిరావు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు. అనారోగ్యం.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఆరోగ్యభంగం.

ధనుస్సు: ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి.

మకరం: కొత్త వ్యక్తులు పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాలు పరిష్కారం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కుంభం: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మీనం: వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మరిన్ని వార్తలు