Today Horoscope in Telugu: ఈరాశి వారికి ప్రముఖులతో పరిచయాలు

14 Jul, 2022 06:53 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, తిథి బ.పాడ్యమి రా.10.11 వరకు, తదుపరి విదియ, నక్షత్రం ఉత్తరాషాఢ రా.10.52 వరకు, తదుపరి శ్రవణ; వర్జ్యం ఉ.7.54 నుండి 9.24 వరకు, తిరిగి రా.2.34 నుండి 4.05 వరకు, దుర్ముహూర్తం ఉ.9.54 నుండి 10.46 వరకు, తదుపరి ప.3.06 నుండి 3.58 వరకు, అమృత ఘడియలు సా.4.50 నుండి 6.19 వరకు

సూర్యోదయం :    5.36
సూర్యాస్తమయం    : 6.34
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు 

మేషం: మిత్రులతో సఖ్యత. విందు వినోదాలు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. ఆస్తులు వివాదాలు పరిష్కారం. భూలాభాలు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో  ఉన్నతి.

వృషభం: వ్యవహారాలలో ఆటంకాలు. బంధువిరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగాలలో అనుకోని మార్పులు. అనారోగ్యం.

మిథునం: మిత్రులతో మాటపట్టింపులు. అనుకోని ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి సమస్యలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి లాభ సూచనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో  హోదాలు దక్కుతాయి.

సింహం: నూతన వ్యక్తుల పరిచయం. కొత్త పనులకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య: ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవచింతన. వ్యవహారాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తప్పవు.

తుల: చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగాలలో పనిభారం.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

మకరం: శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ప్రగతి.

కుంభం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు.

మీనం: రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. పనులు సకాలంలోపూర్తి చేస్తారు. దూరపు బం«ధువుల కలయిక. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి.
 

మరిన్ని వార్తలు