ఈ రాశి వారికి అంతా అనుకూలమే ఫుల్‌ స్పీడ్‌తో దూసుకెళ్తారు

14 Sep, 2022 06:48 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.చవితి ప.12.19 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: అశ్వని ఉ.9.51 వరకు, తదుపరి భరణి వర్జ్యం: రా.7.45 నుండి 9.26 వరకు, దుర్ముహూర్తం: ప.11.33 నుండి 12.21 వరకు, అమృతఘడియలు: తె.5.44 నుండి 7.22 వరకు (తెల్లవారితే గురువారం).

సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.03
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆర్థిక విషయాలలో నిరుత్సాహం. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో వివాదాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తి.గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వృత్తి, వ్యాపారాలలో పురోగతి. కళాకారులకు విశేష సన్మానాలు.

మిథునం: కొత్త పనులు చేపడతారు. పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వృత్తి, వ్యాపారాలలో మరింత  పురోగతి. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

కర్కాటకం: కొత్తగా రుణాలు చేస్తారు. పనులలో స్వల్ప ఆటంకాలు. దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. అనారోగ్యం.

సింహం: ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. పనులలో జాప్యం. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవచింతన. వ్యాపారాలు కొంత అనుకూలం. ఉద్యోగాలలో పనిభారం. బంధువులతో మాటపట్టింపులు.

కన్య: వృత్తి,వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఆత్మీయులు దగ్గరవుతారు. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. యత్నకార్యసిద్ధి. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి..

తుల: విందువినోదాలు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. ఆలయ దర్శనాలు. శుభవర్తమానాలు. ఆస్తిలాభ సూచనలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: శ్రమ పడ్డా ఫలితం అంతగా ఉండదు. దూరప్రయాణాలు. ఒప్పందాలలో ఆటంకాలు. సోదరులతో వివాదాలు. వ్యాపారాలలో కొన్ని ఇబ్బందులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

ధనుస్సు: ఆశ్చర్యకరమైన సంఘటనలు. సోదరులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో మార్పులు.

మకరం: వ్యవహారాలలో విజయం. శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. సన్నిహితులతో వివాదాల పరిష్కారం. ఉద్యోగయోగం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో మంచి గుర్తింపు.

కుంభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. అనారోగ్యం. ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు. ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.

మీనం: ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

మరిన్ని వార్తలు