Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయమే, వస్తులాభం

16 Nov, 2022 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.అష్టమి తె.4.10 వరకు (తెల్లవారితే గురువారం) తదుపరి నవమి, నక్షత్రం: ఆశ్లేష సా.4.31 వరకు తదుపరి మఖ, వర్జ్యం: తె.5.36 నుండి 7.21 వరకు (లె ల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.21 నుండి 12.06 వరకు అమృతఘడియలు: ప.2.46 నుండి 4.31 వరకు.

సూర్యోదయం :    6.09
సూర్యాస్తమయం    :  5.21
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. సోదరులు, మిత్రులతో విభేదాలు. వ్యాపారులకు లాభాలు అంతగా ఉండవు. ఉద్యోగులకు అనుకోని మార్పులు సంభవం. 

వృషభం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. బంధువుల నుంచి ధనలాభ సూచనలు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల కలయిక. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగాల్లో  పైహోదాలు.  

మిథునం: మిత్రులతో అకారణంగా తగాదాలు. కొన్ని పనులు మధ్యలోనే విరమిస్తారు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. రాబడి అంతగా ఉండదు. ఉద్యోగాల్లో  పనిభారం. వ్యాపారులకు సామాన్యలాభాలు.  

కర్కాటకం: కార్యజయం.  మొండిబాకీలు వసూలవుతాయి.  సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. 

సింహం: కుటుంబంలో చికాకులు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా వేసుకుంటారు. అనారోగ్య సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడుల్లో ఆటంకాలు. ఉద్యోగులకు స్థానచలనం.

కన్య: పనులు సకాలంలో పూర్తి కాగలవు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులకు సంతోషకరంగా ఉంటుంది. 

తుల: పనుల్లో  విజయం సాధిస్తారు. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు. పాత మిత్రుల కలయిక.  రాబడి ఆశాజనకం. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులకు కీలక మార్పులు.

వృశ్చికం: పనుల్లో అవాంతరాలు. కుటుంబంలో సమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. శారీరక  రుగ్మతలు. రాబడి తగ్గే సూచనలు. వ్యాపారులకు అంచనాలు తప్పుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. 

ధనుస్సు: ముఖ్య పనులు మందకొడిగా సాగుతాయి. వివాదాలు చికాకు పరుస్తాయి. కష్టానికి ఫలితం దక్కదు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారుల యత్నాలు ముందుకు సాగవు.  ఉద్యోగులకు చిక్కులు. 

మకరం: దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. వ్యాపారాలలో అనుకున్న లాభాలు రాగలవు. ఉద్యోగులకు మరింత అనుకూలం. 

కుంభం: ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అదనపు ఆదాయం సమకూరుతుంది.  అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారులకు  అనుకున్న లాభాలు లభిస్తాయి. ఉద్యోగులు విధులు సమర్ధవంతంగా నిర్వర్తిస్తారు. 

మీనం: ముఖ్యమైన పనుల్లో  ఆటంకాలు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఆలోచనలు నిలకడగా ఉండవు. రాబడి అంతగా కనిపించదు. వ్యాపారులకు అధికారుల రీత్యా ఒత్తిడులు. ఉద్యోగులకు అనుకోని  మరింత పనిభారం. 

మరిన్ని వార్తలు