ఈ రాశి వారికి ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన.. ఆకస్మిక ధనలాభం

17 Jan, 2023 06:38 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, తిథి: బ.దశమి ప.12.57 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: విశాఖ ప.2.24 వరకు, తదుపరి అనూరాధ, వర్జ్యం: సా.6.15 నుండి 7.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.51 నుండి 9.34 వరకు తదుపరి రా.10.53 నుండి 11.45 వరకు, అమృతఘడియలు: ఉ.5.48 నుండి 7.19 వరకు, తిరిగి రా.3.33 నుండి 5.06 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.38, సూర్యాస్తమయం: 5.42 

మేషం: వ్యవహారాలలో గందరగోళం. కుటుంబంలో చికాకులు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనూహ్య మార్పులు.

మిథునం: కాంట్రాక్టులు లభిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణయత్నాలు సాగిస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలులో ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సింహం: సోదరులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు సా«ధారణంగా ఉంటాయి.

కన్య: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సమాజసేవలో భాగస్వాములవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి.

తుల: దూరప్రయాణాలు. చేపట్టిన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు.

వృశ్చికం: రావలసిన సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. గతం గుర్తుకు వస్తుంది. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అభివృద్ధి.

ధనుస్సు: వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

మకరం: కార్యజయం. విద్య, ఉద్యోగావకాశాలు. భూలాభాలు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

కుంభం: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. భూవివాదాలు పరిష్కారం. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

మీనం: ప్రయాణాలు వాయిదా. విద్యాయత్నాలు కలసిరావు. పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చిక్కులు

మరిన్ని వార్తలు