ఈ రాశి వారు శుభవార్త వింటారు, ధనలబ్ధి

18 Aug, 2022 06:48 IST|Sakshi

మేషం: వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు.

వృషభం: బంధువులతో స్వల్ప వివాదాలు. పనులు వాయిదా పడతాయి. అనారోగ్యం. శ్రమకు తగిన ఫలితం కష్టమే. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. ఆలయ దర్శనాలు.

మిథునం: కొన్ని పనులు అనుకున్న విధంగా పూర్తి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక ప్రగతి. సన్నిహితుల నుంచి ధనలబ్ధి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.

కర్కాటకం: నూతన విషయాలు తెలుసుకుంటారు. గౌరవమర్యాదలు పొందుతారు. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి.  ఆలయ దర్శనాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలత.

సింహం: రుణబాధలు. కుటుంబసభ్యులతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు.

కన్య: కుటుంబ, ఆర్థిక సమస్యలు. భూవివాదాలు. మానసిక అశాంతి. పనుల్లో ఆటంకాలు.  వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో మార్పులు. అనారోగ్యం. దైవదర్శనాలు చేసుకుంటారు.

తుల: ప్రముఖుల నుంచి ముఖ్యసందేశం. విలువైన సామగ్రి కొంటారు. వ్యాపారాలలో అనుకూలస్థితి. ఉద్యోగాలలో పూర్వవైభవం. దూరపు బంధువులతో వివాదాల పరిష్కారం.

వృశ్చికం: దూరప్రాంతాల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనులలో ఆటంకాలు. మానసిక అశాంతి. మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. దైవదర్శనాలు.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యభంగం. శ్రమ తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో నిరాశ.

కుంభం: పర్యటనలు ఫలిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయాలు. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనాలు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. అనుకోని ఖర్చులు. బంధువులతో విరోధాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. మనశ్శాంతి లోపిస్తుంది. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరుగుతాయి.

మరిన్ని వార్తలు