Today Horoscope: ఈ రాశుల వారు కొత్త పనులు ప్రారంభిస్తారు, వస్తు లాభం

18 Sep, 2022 07:13 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.అష్టమి సా.4.23 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: మృగశిర సా.4.16 వరకు, తదుపరి ఆరుద్ర వర్జ్యం: రా.1.30 నుండి 3.16 వరకు దుర్ముహూర్తం: సా.4.21 నుండి 5.11 వరకు అమృతఘడియలు: ఉ.6.44 నుండి 8.24 వరకు.

సూర్యోదయం        :  5.51
సూర్యాస్తమయం    :  5.59
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం :  ప.12.00 నుంచి 1.30 వరకు 

మేషం: పనులు మరింత వేగం పుంజుకుంటాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాతమిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: సన్నిహితుల నుండి ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తులు సమకూరతాయి. ఆప్తుల నుండి కీలక సమాచారం. అందరిలోనూ ప్రత్యేకత చాటుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం: మిత్రులతో వివాదాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి. వ్యయప్రయాసలు. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

సింహం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తుల వివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: ఇంటర్వ్యూలకు హాజరవుతారు. ఆర్థిక విషయాలలో పురోగతి. కుటుంబంలో సంతోషదాయకంగా గడుస్తుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: కొన్ని పనులు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృశ్చికం: మీ శ్రమ వృథా కాగలదు. ప్రయాణాలలో అవాంతరాలు. పనుల్లో జాప్యం. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

ధనుస్సు: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు నూతన అవకాశాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత పురోగతి సాధిస్తారు.

మకరం: వ్యవహారాలలో విజయం. సన్నిహితుల సాయం అందుతుంది. భూవివాదాలు తీరతాయి. శ్రమ ఫలిస్తుంది. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఊహలు నిజం చేసుకుంటారు.

కుంభం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తులు విషయంలో సోదరులతో వివాదాలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మీనం: ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ఆర్థిక విషయాలలో గందరగోళం. ప్రయాణాలు వాయిదా. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలో చికాకులు.

మరిన్ని వార్తలు