ఈ రాశి వారికి సమస్యలు తీరిపోయి శుభవార్తలు వింటారు

19 Aug, 2022 07:00 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.అష్టమి రా.1.07 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: కృత్తిక తె.4.56 వరకు, తదుపరి రోహిణి, వర్జ్యం: సా.4.08 నుండి 5.51 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.27 నుండి 1.19 వరకు, అమృతఘడియలు: రా.2.19 నుండి 4.02 వరకు, గోకులాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. 

సూర్యోదయం :    5.46
సూర్యాస్తమయం     :  6.22
రాహుకాలం : ఉ.10.30 నుంచి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుంచి 4.30 వరకు 

మేషం: పనులలో ఆటంకాలు. వ్యయప్రయాసలు. బంధువుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృషభం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా కొనసాగుతాయి.

మిథునం: సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. అనారోగ్యం. పనుల్లో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: ఇంటర్వ్యూలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. స్థిరాస్తి ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కన్య: రుణయత్నాలు సాగిస్తారు. శ్రమాధిక్యం. పనుల్లో ప్రతిబంధకాలు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

తుల: బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. సోదరులతో కలహాలు.  వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృశ్చికం: కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

ధనుస్సు: పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: పనులలో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. ధనవ్యయం.

కుంభం: రుణఒత్తిడులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. సోదరులతో కలహాలు. ఆరోగ్య  సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

మీనం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. నూతన విద్యావకాశాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
 

మరిన్ని వార్తలు