Today Horoscope: ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..

19 Sep, 2022 06:59 IST|Sakshi

శ్రీశుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.నవమి సా.6.19 వరకు, తదుపరి దశమి నక్షత్రం: ఆరుద్ర సా.6.43 వరకు, తదుపరి పునర్వసు వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ప.12.18 నుండి 1.06 వరకు తదుపరి ప.2.43 నుండి 3.33 వరకు అమృతఘడియలు: ఉ.7.40 నుండి 9.26 వరకు.

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.58
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు

మేషం: కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆర్థికాభివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. వాహనసౌఖ్యం.

వృషభం: కుటుంబంలో చికాకులు. అరోగ్య సమస్యలు. కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మిథునం: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. యత్నకార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. విందువినోదాలు.

కర్కాటకం: చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. మిత్రుల  నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని చికాకులు. 

సింహం: యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. వస్తులాభాలు. నిరుద్యోగులకు శుభవర్తమానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. దైవదర్శనాలు.

కన్య: ప్రయాణాలు లాభిస్తాయి. కొత్త అంచనాలతో ముందుకు సాగుతారు. కార్యజయం. శుభవర్తమానాలు. అదనపు రాబడి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి.

తుల: దూరప్రయాణాలు. కార్యక్రమాలు వాయిదా వేస్తారు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులు, మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తప్పవు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాలలో ఆటంకాలు. కొత్తగా అప్పులు చేస్తారు. ఆస్తి వివాదాలు. సోదరులు, మిత్రుల నుంచి విమర్శలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

ధనస్సు: సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలబ్ధి. గత సంఘటనలు గుర్తుకువస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అభివృద్ధి.

మకరం: నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. యత్నకార్యసిద్ధి. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు. 

మీనం: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక ఆందోళన. ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.

మరిన్ని వార్తలు