Today Horoscope: ఈ రాశి వారికి అన్నింటా విజయం.. ఆస్తి, ధనలాభం

19 Nov, 2022 06:47 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.దశమి ఉ.6.50 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: ఉత్తర రా.9.46 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.6.11 నుండి 7.40 వరకు, అమృతఘడియలు: ప.2.11 నుండి 3.54 వరకు; రాహుకాలం : ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం : ప.1.30 నుండి 3.00 వరకు; సూర్యోదయం 6.10; సూర్యాస్తమయం 5.21. 

మేషం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఆస్తి వివాదాలు. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

వృషభం: అనుకోని ప్రయాణాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

మిథునం: కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరం.

కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో అవరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభాపాటవాలకు గుర్తింపు రాగలదు. ఆస్తిలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కన్య: శ్రమ తప్పదు. కొన్ని పనులు వాయిదా పడతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

తుల: పరపతి పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. ఆసక్తికరమైన సమాచారం. విందువినోదాలు. రావలసిన సొమ్ము అందుతుంది. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

ధనుస్సు: పరిచయాలు మరింతగా పెరుగుతాయి. విద్యార్థులకు అనుకూలం. కొత్త పనులు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

మకరం: ముఖ్యమైన పనులలో స్వల్ప ఆటంకాలు. మిత్రులతో విభేదాలు. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.

కుంభం: వ్యవహారాలలో అవరోధాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. దూరప్రయాణాలు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.

మీనం: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మరిన్ని వార్తలు