ఈ రాశి వారు ప్రముఖుల నుంచి శుభవార్తలు వింటారు

20 Jun, 2022 06:43 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.సప్తమి రా.2.40 వరకు, తదుపరి అష్టమి నక్షత్రం శతభిషం ఉ.10.48 వరకు, తదుపరి పూర్వాభాద్ర వర్జ్యం సా.5.03 నుండి 6.34 వరకు, దుర్ముహూర్తం ప.12.26 నుండి 1.20 వరకు, తదుపరి ప.3.03 నుండి 3.54 వరకు అమృతఘడియలు... రా.2.22 నుండి 3.55 వరకు..

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.32
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆస్తిలాభ సూచనలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత అనుకూలం. కాంట్రాక్టులు లభిస్తాయి.

వృషభం: ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. పనులలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. నూతన ఉద్యోగావకాశాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూలం.

మిథునం: ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కొన్ని వివాదాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి.

కర్కాటకం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.

సింహం: సన్నిహితుల నుంచి ముఖ్య సమాచారం. వస్తు, వస్త్రలాభాలు. బాకీలు కొన్ని వసూలవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

కన్య: ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రముఖుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: సన్నిహితుల నుంచి సమస్యలు. ప్రయాణాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ధనవ్యయం.

వృశ్చికం: వ్యవహారాలలో ఆటంకాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

ధనుస్సు: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. పనుల్లో విజయం. ఆప్తుల నుంచి శుభవార్తలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

మకరం: మిత్రులు, కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. కొన్ని పనులలో జాప్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో మరింత అనుకూలత. వస్తులాభాలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మీనం: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొత్త పనులు వాయిదా వేస్తారు. సోదరులతో విభేదాలు. ప్రయాణాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

మరిన్ని వార్తలు