Today Horoscope: ఈ రాశి వారికి అన్నింటా అనుకూలం, విందువినోదాల్లో పాల్గొంటారు

20 Nov, 2022 07:01 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం తిథి: బ.ఏకాదశి ఉ.7.25 వరకు తదుపరి ద్వాదశి, నక్షత్రం: హస్త రా.10.37 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం: ఉ.6.27 నుండి 8.07 వరకు, దుర్ముహూర్తం: సా.3.51 నుండి 4.34 వరకు, అమృతఘడియలు: సా.4.23 నుండి 8.06 వరకు.

సూర్యోదయం        :  6.11
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
 

మేషం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విందువినోదాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూలం.

వృషభం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో వైరం. దూరప్రయాణాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనారోగ్యం. వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో నిరాశ.

కర్కాటకం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలలో మరింత రాబడి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు.

సింహం: అనుకున్న పనుల్లో ఆటంకాలు. ప్రయాణాలలో మార్పులు. సోదరులు, మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. కుటుంబంలోకొద్దిపాటి సమస్యలు. వ్యాపారాలలో ఆటుపోట్లు. ఉద్యోగాలలో పనిభారం.

కన్య: ఆర్థిక ప్రగతి. ఉత్సాహంగా పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. శ్రమ తప్పకపోవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మిత్రులతో విభేదాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. పనుల్లో విజయం. ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

మకరం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమకు ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కుంభం: ఆర్థికంగా ఇబ్బందులు. కొత్త రుణయత్నాలు. ప్రయాణాలలో స్వల్ప మార్పులు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో విజయం. ఆస్తుల విషయంలో ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మరిన్ని వార్తలు