ఈ రాశి వారు ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు

21 Jun, 2022 06:53 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు,జ్యేష్ఠ మాసం, తిథి బ.అష్టమి రా.1.32 వరకు, తదుపరి నవమి,నక్షత్రం పూర్వాభాద్ర ఉ.10.11 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర,వర్జ్యం సా.7.42 నుండి 9.15 వరకు, దుర్ముహూర్తం ఉ.8.06 నుండి 8.58 వరకు, తదుపరి రా.10.56 నుండి 11.40 వరకు అమృతఘడియలు... తె.5.11 నుండి 6.46 వరకు.

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
 

మేషం..రుణబాధలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. పనులలో ఆటంకాలు. శ్రమ తప్పదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.
వృషభం...చిన్ననాటి విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో గౌరవం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మిథునం...వ్యవహారాలలో విజయం. శుభకార్యాలరీత్యా ఖర్చులు. సోదరులతో సఖ్యత. ముఖ్య నిర్ణయాలలో ఆటంకాలు. ఆస్తుల వివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు తొలగుతాయి.
కర్కాటకం..అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేయాల్సివస్తుంది. బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

సింహం: ఆకస్మిక ధనలబ్ధి. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆశయాలు నెరవేరతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు సైతం వసూలవుతాయి. ఆశ్చర్యకర విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో ఆదరణ. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని అనుకూల మార్పులు.

తుల: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు.

వృశ్చికం: స్వీయనిర్ణయాలు తగదు. అనుకున్న పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. శ్రమ పెరుగుతుంది. ఆరోగ్యసమస్యలు. దైవదర్శనాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

ధనుస్సు: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత ప్రగతి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. 

మకరం: మ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. చిత్రమైన సంఘటనలు. ధనలాభాలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో బదిలీ అవకాశాలు.

కుంభం: చిన్ననాటి మిత్రుల నుంచి వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాదాలు తీరతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు.

మీనం: వ్యయప్రయాసలు. బంధుమిత్రులతో కలహాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. పనులు మధ్యలో విరమిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

మరిన్ని వార్తలు