Today Horoscope: ఈ రాశివారు పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు

21 Nov, 2022 06:44 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, తిథి: బ.ద్వాదశి ఉ.7.02 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: చిత్త రా.10.57 వరకు, తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.6.43 నుండి 8.20 వరకు, ఉ.6.43 నుండి 8.20 వరకు, తిరిగి తె.4.31 నుండి 6.06 వరకు, దుర్ముహూర్తం: ప.12.07 నుండి 12.51 వరకు, తదుపరి ప. 2.20 నుండి 3.06 వరకు, అమృతఘడియలు: సా.4.26 నుండి 6.02 వరకు.

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 

మేషం: పనులు చకచకా పూర్తి. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త వస్తువులు కొంటారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉత్సాహం.

వృషభం: పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. ధనప్రాప్తి. ధార్మిక చింతన పెరుగుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటుంది.

మిథునం: పనుల్లో అవాంతరాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యయప్రయాసలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. భూముల వ్యవహారాలలో చికాకులు. ధనవ్యయం. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.

సింహం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. ఆకస్మిక ధనలాభం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

కన్య: బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.

తుల: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు వింటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృశ్చికం: ఆరోగ్య సమస్యలు. పనుల్లో అవాంతరాలు. రుణబాధలు. ప్రయాణాలలో అవాంతరాలుల. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు.

ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మకరం: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొంటారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు ఫలిస్తాయి.

కుంభం: కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆత్మీయులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మీనం: పనుల్లో ప్రతిబంధకాలు. ఇంటాబయటా వ్యతిరేకత. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. బంధువర్గంతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

మరిన్ని వార్తలు