ఈ రాశి వారు శుభవార్తలు వింటారు

22 Jun, 2022 06:51 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, తిథి బ.నవమి రా.12.54 వరకు తదుపరి దశమి, నక్షత్రం ఉత్తరాభాద్ర ఉ.9.58 వరకు తదుపరి రేవతి, వర్జ్యం రా.10.04 నుండి 11.43 వరకు దుర్ముహూర్తం ప.11.35 నుండి 12.26 వరకు అమృతఘడియలు... లేవు. 

సూర్యోదయం :    5.30
సూర్యాస్తమయం    :  6.33
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: వ్యవహారాలలో అవాంతరాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. ఎంత కష్టించినా ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: కార్యజయం. నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి..

కర్కాటకం: శ్రమ పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య సమస్యలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

సింహం: పనుల్లో కొన్ని అవాంతరాలు. రుణయత్నాలు సాగిస్తారు. దూరప్రయాణాలు. సోదరులు, మిత్రుల నుండి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని వివాదాలు.

కన్య: రుణభారాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉన్నతి.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. ఇంటాబయటా అనుకూలత. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

వృశ్చికం: మిత్రులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. పనులు ముందుకు సాగవు. బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.

ధనుస్సు: బంధువులతో మాటపట్టింపులు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సమావేశాలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

కుంభం: పనులు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. అనారోగ్యం. బంధువులతో విభేదాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మీనం: కొన్ని సమస్యలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. పనులు సజావుగా సాగుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మరిన్ని వార్తలు