శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: బ.త్రయోదశి ఉ.7.01 వరకు, తదుపరి చతుర్దశి తె.5.58 వరకు (తెల్లవారితే బుధవారం), నక్షత్రం: స్వాతి రా.10.46 వరకు, తదుపరి విశాఖ, వర్జ్యం: తె.4.14 నుండి 5.48 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.11 వరకు, తదుపరి రా.10.27 నుండి 11.21 వరకు, అమృతఘడియలు: ప.2.01 నుండి 3.36 వరకు.
సూర్యోదయం : 6.12
సూర్యాస్తమయం : 5.20
రాహుకాలం : ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం : ఉ.9.00 నుంచి 10.30 వరకు
మేషం: వ్యవహారాలు సానుకూలమవుతాయి. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. అదనపు రాబడి ఉంటుంది. ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: పనుల్లో ప్రతిబంధకాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: గతం గుర్తుకు తెచ్చుకుంటారు. ఆశ్చర్యకర సంఘటనలు. ముఖ్య నిర్ణయాలు మార్చుకుంటారు. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి.
సింహం: ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తా శ్రవణం. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యవహారాలలో పురోభివృద్ధి. సోదరుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
కన్య: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
తుల: సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పొందుతారు. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
వృశ్చికం: వ్యయప్రయాసలు. ప్రయాణాలలో అవాంతరాలు. పనులు నిదానిస్తాయి. ఆస్తి విషయంలో ఒడిదుడుకులు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.
ధనుస్సు: పరిస్థితులు అనుకూలిస్తాయి. మీ ఉద్యోగయత్నాలలో పురోగతి. సన్నిహితుల సాయం అందుతుంది. మిత్రుల నుండి ముఖ్య సమాచారం. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.
మకరం: నూతన ఉద్యోగాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అంచనాలు నిజం చేసుకుంటారు.
కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. అనారోగ్యం. కుటుంబంలో వివాదాలు. మానసిక అశాంతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మీనం: ఆరోగ్యం మందగిస్తుంది. పనులలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. కష్టానికి ఫలితం కనిపించదు. ఆస్తులు కొనుగోలు నిలిచిపోతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.