ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి

23 May, 2022 06:18 IST|Sakshi

మేషం: ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. ఆప్తులు, బంధువులు మీకు సహాయంగా నిలుస్తారు. సంఘంలో మీరంటే ప్రత్యేక గౌరవం లభిస్తుంది. పరపతి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

వృషభం: కొన్ని బాకీలు వసూలవుతాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలు విజయవంతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణయత్నాలు. దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. బంధువులతో తగాదాలు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలలో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

సింహం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. సేవాకార్యక్రమాలు చేపడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

కన్య: సమస్యల నుండి గట్టెక్కుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. రాబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

తుల: మిత్రులతో కలహాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి. దూరప్రయాణాలు. పనుల్లో జాప్యం. ఆలోచనలు కలసిరావు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

వృశ్చికం: చాకచక్యంగా వ్యవహరించాలి. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు.

ధనుస్సు: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

మకరం: కుటుంబసమస్యలు. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. అనారోగ్యం. స్థిరాస్తి వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొన్ని సమస్యలతో సాగుతాయి.

కుంభం: కష్టానికి ఫలితం కనిపిస్తుంది. ఆస్తి లాభం. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ముఖ్య సమావేశాలకు హాజరవుతారు. ధనలబ్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. అనుకోని ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.

మరిన్ని వార్తలు