ఈ రాశి వారికి అన్నింటా విజయమే, ఆకస్మిక ధనలాభం

23 Sep, 2022 06:50 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు భాద్రపద మాసం, తిథి: బ.త్రయోదశి రా.1.35 వరకు, తదుపరి చతుర్దశి,  నక్షత్రం: మఖ తె.4.11 వరకు (తెల్లవారితే శనివారం) తదుపరి పుబ్బ, వర్జ్యం: ప.3.11 నుండి 4.55 వరకు దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.05 వరకు, తదుపరి ప.12.16 నుండి 1.04 వరకు, అమృతఘడియలు: రా.1.35 నుండి 3.20 వరకు..

సూర్యోదయం :    5.52
సూర్యాస్తమయం    :  5.55
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు

మేషం: పనుల్లో కొన్ని అవాంతరాలు. రుణదాతల ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుండి కొన్ని సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

వృషభం: బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు మధ్యలో విరమిస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా ఉంటాయి.

మిథునం: సన్నిహితులతో సత్సబంధాలు. శుభవార్తా శ్రవణం. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.

కర్కాటకం: కుటుంబసభ్యులతో విభేదాలు పెరుగుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. కష్టానికి ఫలితం కనిపించదు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానిస్తాయి.

సింహం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా గడుపుతారు.

కన్య: వ్యయప్రయాసలు. బంధువుల నుండి సమస్యలు. దూరప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

తుల: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆస్తులు సమకూరతాయి. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరతాయి.

వృశ్చికం: ఎంతటి వారినైనా ఆకట్టుకుంటారు. సన్నిహితుల సాయం అందుతుంది. వాహనాలు కొంటారు. భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.

ధనుస్సు: రుణాలు చేయాల్సిన పరిస్థితి. కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమ మరింత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మకరం: ఇంటాబయటా సమస్యలు. పనుల్లో అవాంతరాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో ఆదరణ. సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజం చేసుకుంటారు.

మరిన్ని వార్తలు