Today Horoscope: ఈ రాశివారికి శ్రమ తప్ప ఫలితం ఉండదు.. అనారోగ్యం

23 Nov, 2022 06:39 IST|Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు కార్తీక మాసం, తిథి: అమావాస్య తె.4.38 వరకు (తెల్లవారితే గురువారం), తదుపరి మార్గశిర శు.పాడ్యమి, నక్షత్రం: విశాఖ రా.10.14 వరకు, తదుపరి అనురాధ, వర్జ్యం: రా.2.03 నుండి 3.35 వరకు, దుర్ముహూర్తం: ప.11.22 నుండి 12.07 వరకు అమృతఘడియలు: ప.1.36 నుండి 3.10 వరకు.

సూర్యోదయం :    6.12
సూర్యాస్తమయం    :  5.20
రాహుకాలం :  ప. 12.00 నుంచి 1.30 వరకు
యమగండం :  ఉ.7.30 నుంచి 9.00 వరకు 

మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు.

వృషభం: ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు.

మిథునం: వ్యవహారాలలో అవరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు.

కర్కాటకం: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యసమస్యలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

సింహం: సన్నిహితుల సాయం అందుతుంది. నూతన ఉద్యోగ, విద్యావకాశాలు. ప్రముఖుల పరిచయం. శుభవార్తా శ్రవణం. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

కన్య: శ్రమ మరింత పెరుగుతుంది. పనుల్లో అవరోధాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో పురోగతి.

వృశ్చికం: రుణాలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దేవాలయ దర్శనాలు. కష్టమే తప్ప ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

ధనుస్సు: దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఆప్తులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు రాగలదు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. ధనప్రాప్తి.

మకరం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. ఉద్యోగయోగం. భూ, గృహయోగాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కుంభం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. అనారోగ్యం. శ్రమ తప్ప ఫలితం ఉండదు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో అనుకోని మార్పులు.

మీనం: రాబడికి మించి ఖర్చులు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

మరిన్ని వార్తలు